48 ఏళ్లలో 17, 532 మొక్కలు | 17, 532 plants in 48 years | Sakshi
Sakshi News home page

48 ఏళ్లలో 17, 532 మొక్కలు

Jul 17 2017 3:44 AM | Updated on Sep 5 2017 4:10 PM

48 ఏళ్లలో 17, 532 మొక్కలు

48 ఏళ్లలో 17, 532 మొక్కలు

అబ్దుల్‌ సమద్‌ షేక్‌.. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ 60 ఏళ్ల వృద్ధుడికి మరో పేరు కూడా ఉందండోయ్‌!

అబ్దుల్‌ సమద్‌ షేక్‌.. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ 60 ఏళ్ల వృద్ధుడికి మరో పేరు కూడా ఉందండోయ్‌! అందరూ ఇతడిని ముద్దుగా ‘ట్రీ సమద్‌’ అని పిలుస్తున్నారు.  సమద్‌కున్న ఓ అలవాటు వల్ల ఈ పేరు వచ్చింది. అదే గత 48 ఏళ్లుగా ప్రతిరోజూ ఒక మొక్కను నాటడం! ఇతని స్వస్థలం బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్‌. రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజుకి సుమారుగా రూ. 80 సంపాదిస్తుంటాడు. తాను సంపాదించిన ఆదాయంలో నుంచే ఫరీదా పూర్‌ హార్టికల్చర్‌ సెంటర్‌లో రోజూ ఒక మొక్కను కొని నాటుతూ వస్తున్నాడు. ఇతడికి సొంత ఇల్లు కూడా లేదు. ఫరీద్‌పూర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫీసుకు చెందిన స్థలంలో రెండు రేకుల షెడ్లు వేసుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు.

సమాజానికి అబ్దుల్‌ చేస్తున్న కృషిని గుర్తించి ది డైలీ స్టార్‌ అనే వార్తా సంస్థ అతడికి రూ. 80 వేల నగదు బహుమతిని అందజేసి గౌరవించింది. 48 ఏళ్లలో ఆయన మొత్తం 17,532 మొక్కలను నాటాడు. ‘నా పదకొండో ఏట నుంచే మొక్కలను నాటడం ప్రారంభించాను. ప్రభుత్వ స్థలంలోనే వాటిని నాటుతాను. దీంతో వాటిని ఎవరూ పెరికేందుకు ప్రయత్నించరు. ఎవరైనా మొక్కలు పీకితే నాకు చాలా కోపం వస్తుంది. రోజూ ఒక మొక్క అయినా నాటనిదే నాకు నిద్ర పట్టదు. నాకు ప్రాణులు, జంతువులన్నా ఇష్టమే’ అని సమద్‌ ప్రేమగా చెబుతున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement