అమెరికాలో కూలిన సైనిక విమానం | 16 dead in military plane crash in Mississippi | Sakshi
Sakshi News home page

అమెరికాలో కూలిన సైనిక విమానం

Jul 12 2017 1:09 AM | Updated on Sep 5 2017 3:47 PM

అమెరికాలో కూలిన సైనిక విమానం

అమెరికాలో కూలిన సైనిక విమానం

అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో సైనిక విమానం కూలిపోవడంతో 16 మంది సైనికులు మృతిచెందారు.

16 మంది దుర్మరణం
వాషింగ్టన్‌: అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో సైనిక విమానం కూలిపోవడంతో 16 మంది సైనికులు మృతిచెందారు. సోమవారం సాయంత్రం మిసిసిపీలోని లీఫ్లోర్‌ కౌంటీలో 16 మందితో వెళ్తున్న కేసీ–130 అనే విమానం కుప్పకూలినట్లు అధికారులు ధ్రువీకరించారు. అందులో నుంచి ఎవరూ సజీవంగా బయటపడలేదని నిర్ధారించారు.

విమానం ఉత్తర కరోలినాలోని చెర్రీ పాయింట్‌ మెరైన్‌ కార్ప్స్‌ నుంచి బయల్దేరిన తరువాత మిసిసిపీలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్‌ రీఫుయెలింగ్‌ విమానం అయిన కేసీ–30 సైనికులతో పాటు సరుకులను కూడా రవాణాచేయగలదు. ఈ ఘటనపై విచారణ ప్రారంభమైంది. సైనిక విమానం కుప్పకూలిందన్న వార్త తనను కలచివేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచారం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement