ఢాకా ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పేలుడు: 13 మంది మృతి

13 Killed and 21 Injured in Fire at Illegal Plastic Factory in Bangladesh - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లో అక్రమ నిర్వహణలో ఉన్న ఓ ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు వల్ల 13 మంది మృత్యువాత పడ్డారు. 21 మంది తీవ్రగాయాల పాలయ్యారు. «ఢాకా శివారు  కెరాణీగంజ్‌లోని ప్లాస్టిక్‌ కంపెనీలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న 13 మంది మరణించారు. ఈ ప్రమాదం ఎందుకు సంభవించిందనేది నిర్ధిష్టంగా తెలియరాలేదు. నజ్రుల్‌ ఇస్లాం అనే వ్యక్తికి చెందిన ఈ కంపెనీలో ఈ యేడాది ఫిబ్రవరిలో సైతం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ ప్లేట్లూ, కప్పులను తయారుచేసే ఈ ఫ్యాక్టరీలో మొత్తం 300 మంది రెండు షిఫ్టుల్లో పనిచేస్తారనీ, బుధవారం ఫ్యాక్టరీలో ప్రమాద సమయంలో 150 మంది పనిచేస్తున్నట్టు కార్మికులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top