అమెరికాలో మళ్లీ కాల్పులు; 13 మందికి గాయాలు | 13 injured in chicago firing | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ కాల్పులు; 13 మందికి గాయాలు

Sep 21 2013 2:12 AM | Updated on Aug 30 2018 5:27 PM

వాషింగ్టన్ నేవీ యార్డు కాల్పుల ఘటన మరవక ముందే అమెరికాలో మళ్లీ తుపాకులు పేలాయి.

షికాగో: వాషింగ్టన్ నేవీ యార్డు కాల్పుల ఘటన మరవక ముందే అమెరికాలో మళ్లీ తుపాకులు పేలాయి. షికాగో శివారు బ్యాక్ ఆఫ్ ద  యార్డ్స్‌లోని కార్నెల్ స్క్వేర్ పార్కులో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మూడేళ్ల బాలుడు సహా 11 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన బాలుడితోపాటు మరో ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. ఒక తూటా బాలుడి చెంపలోకి దూసుకెళ్లిందని అతని బంధువు చెప్పాడు. దుండుగులు ఓ కారులోంచి తనపై కాల్పులు జరపగా తప్పించుకున్నానని, తర్వాత వారు పార్కులోకి వెళ్లి కాల్పులు జరిపారని చెప్పాడు. పోలీసులు తక్షణమే పది అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement