విషం తాగి యువకుడి మృతి | youth suicide in hyderabad due to love affair | Sakshi
Sakshi News home page

విషం తాగి యువకుడి మృతి

Dec 13 2015 9:31 AM | Updated on Sep 4 2018 5:07 PM

ప్రేమించిన యువతితో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్‌: ప్రేమించిన యువతితో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని క్రిష్ణారెడ్డి నగర్ కాలనీలో కృష్ణ(23) అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు.

గత కొన్ని రోజులుగా ఆ యువతితో కృష్ణ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన అతను ఆదివారం విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement