'హైకోర్టు తీర్పు స్పీకర్కు చెంపపెట్టులాంటిది' | YCP leader Happy Over High Court Verdict On MLAs migration | Sakshi
Sakshi News home page

'హైకోర్టు తీర్పు స్పీకర్కు చెంపపెట్టులాంటిది'

Sep 21 2016 11:39 AM | Updated on Aug 31 2018 8:57 PM

'హైకోర్టు తీర్పు స్పీకర్కు చెంపపెట్టులాంటిది' - Sakshi

'హైకోర్టు తీర్పు స్పీకర్కు చెంపపెట్టులాంటిది'

ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ తెలిపారు.

హైదరాబాద్ : ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లో శివకుమార్ మాట్లాడుతూ... హైకోర్టు తీర్పు స్పీకర్కు చెంపపెట్టులాంటిదని ఆయన అభివర్ణించారు. పార్టీ ఫిరాయించిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేయాలని స్పీకర్కు శివకుమార్ విజ్ఞప్తి చేశారు.

హైకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువులోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని శివకుమార్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement