Sakshi News home page

వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో టోకరా

Published Thu, Nov 24 2016 1:51 AM

వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో టోకరా

 సాక్షి, సిటీబ్యూరో: వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చి, రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో అందినకాడికి దండుకుని మోసం చేస్తున్న కేసులో నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నిరుద్యోగులు, గృహిణులు అతని బారినపడినట్లు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఒడిస్సాలోని ఖలాస్ఫూర్‌కు చెందిన అనిల్ కుమార్ సాహు నగరానికి వలసవచ్చి ఉప్పల్ శ్రీనగర్‌కాలనీలో ఉంటున్నాడు. 
 
 తేలిగ్గా డబ్బు సంపాదించాలని పథకం వేసిన అతను నౌకరీ.కామ్ వెబ్‌సైట్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ప్రకటనలు ఇచ్చి, సెల్‌ఫోన్ నెంబర్, మెరుుల్ ఐడీ ఇస్తూ పలువురు నిరుద్యోగుల్ని ఆకర్షిస్తున్నాడు. సంప్రదించిన వారితో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగమని, ఇంట్లోనే ఉండి తాను పంపిన పీడీఎఫ్ ఫైల్స్‌ను వర్డ్ ఫైల్స్‌గా మార్చి తమకు పంపడమే ఉద్యోగమంటూ నమ్మించి రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో రూ.1050 బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయిచుకుని మోసం చేసే వాడు. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన రాజశ్రీ గత జనవరిలో నౌకరీ.కామ్ వెబ్‌సైట్‌లో అనిల్‌కుమార్‌ను సంప్రదించారు.
 
  ‘పీడీఎఫ్ టు వర్డ్’ డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో రూ.1050 డిపాజిట్ చేయించుకున్న అనిల్ మూడు ప్రాజెక్టులు సైతం చేయించాడు. ఒక్కో ప్రాజెక్టుకు రూ.8 వేల చొప్పున చెల్లించాల్సిన అనిల్‌కుమార్ మెహత,విల్సన్‌ల పేరుతో సెల్ నెంబర్లు ఇచ్చి వాటిలో సంప్రదించమని చెప్పాడు. అరుుతే ఫలితం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించారు. బుధవారం అతడికి అరెస్టు చేసి వాహనం, డెబిట్‌కార్టులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement