జీడిమెట్లలో మహిళ దారుణ హత్య | woman murdered in hyderabad jeedimetla | Sakshi
Sakshi News home page

జీడిమెట్లలో మహిళ దారుణ హత్య

Mar 3 2016 10:35 AM | Updated on Sep 4 2018 5:07 PM

జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. హెచ్‌ఎంటీ సమీపంలో గురువారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతి

హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. హెచ్‌ఎంటీ సమీపంలో గురువారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని దుండగులు  మహిళ(45)ను బండరాయితో కొట్టి చంపినట్లుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement