ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం టీడీఎల్పీ సమావేశం జరిగింది.
హైదరాబాద్: అవినీతికి పాల్పడితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ లో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. జన్మభూమిని విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యేల వ్యవహారాల్లో మంత్రులు జోక్యం చేసుకోవద్దని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు.