‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదించిందని సంబరపడకుం డా.. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు అప్రమత్తంగా ఉండాలి.
=బిల్లు ఆమోదం పొందేవరకు అప్రమత్తంగా ఉండాలి..
=టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపు
అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదించిందని సంబరపడకుం డా.. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు అప్రమత్తంగా ఉండాలి. అప్పటివరకు వివిధ పద్ధతుల్లో పోరాడాల్సిన అవసరముందని’ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. ఎన్నికుట్రలు, విమర్శలు చేసినా ఓపిగ్గా ఉండాలని తెలంగాణవాదులకు సూచించారు.
శుక్రవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్‌లో తెలంగాణ వాణిజ్యపన్నులశాఖ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం కోలాహలంగా జరిగింది. దేవీప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి నూతన కార్యవర్గంచే ప్రమాణం చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణఉద్యమంలో వాణిజ్యపన్నులశాఖ టీఎన్జీవోలు క్రీయాశీలకపాత్ర పోషిం చారని, ఉద్యోగుల త్యాగాల వల్లే ఆరుదశాబ్దాల కల సాకారమయ్యే సమయం వచ్చిందన్నారు. టీఎన్జీవో ప్రధానకార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి, హైదరాబాద్‌జిల్లా అధ్యక్షుడు ముజీబ్, జి.జ్ఞానేశ్వర్, రామినేని శ్రీనివాస్‌రావు, వెం కట్, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం : అధ్యక్షుడిగా బి.శ్యాం, అసోసియేట్ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్, ఉపాధ్యక్షులు నర్సింగ్‌రావు, సురేష్, రవీందర్‌నాయక్, ప్రధానకార్యదర్శి వేణుగోపాల్‌రావు, సహాయకార్యదర్శులు సుధీర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, కోశాధికారి హరిప్రసాద్, కార్యనిర్వాహకకార్యదర్శి హరినాథ్, ప్రచారకార్యదర్శి ఎం.ఎ.మన్నన్,కార్యాలయకార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రావు, కార్యవర్గసభ్యులు వెంకటరమణ, సునీత, నారాయణ, పవన్‌కుమార్‌లు ప్రమాణస్వీకారం చేశారు.