నల్లగొండ ఘటనకు ప్రతీకారమే వికార్ హత్య: ఓవైసీ | vikaruddi gang was murderd says AIMIM chief asaduddin owaisi | Sakshi
Sakshi News home page

నల్లగొండ ఘటనకు ప్రతీకారమే వికార్ హత్య: ఓవైసీ

Apr 7 2015 9:15 PM | Updated on Sep 2 2017 11:59 PM

నల్లగొండ ఘటనకు ప్రతీకారమే వికార్ హత్య: ఓవైసీ

నల్లగొండ ఘటనకు ప్రతీకారమే వికార్ హత్య: ఓవైసీ

వికార్ గ్యాంగ్ది ఎన్కౌంటర్ కాదని, ముమ్మాటికి హత్యేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

సిమి తీవ్రవాది వికారుద్దీన్ సహా ఐదుగురు ఐఎస్ఐ ఉగ్రవాదుల ఎన్కౌంటర్పై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్సందించారు. వికార్ గ్యాంగ్ది ఎన్కౌంటర్ కాదని, ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట, జానకీపురం ఘటనలకు ప్రతీకారంగానే పోలీసులు వికార్ గ్యాంగును హత్యచేశారని అన్నారు. దీనిపై ప్రభుత్వం లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మంగళవారం వరంగల్ నుంచి హైదరాబాద్ కోర్టుకు తరలిస్తుండగా ఎస్కార్ట్ వాహనంలోని పోలీసులపై దాడిచేసి తప్పించుకోజూసిన వికార్, అతని సహచరులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సంచలనం రేపిన ఈ ఘటనపై వికార్ తండ్రి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమారుడిని పోలీసులే పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement