వయా మీడియా | Via Media | Sakshi
Sakshi News home page

వయా మీడియా

Jan 14 2016 4:25 AM | Updated on Mar 22 2019 6:18 PM

వయా మీడియా - Sakshi

వయా మీడియా

గ్రేటర్ టిక్కెట్ కోసం ఆశావహులు బయోడేటాలు పుచ్చుకుని నేతల దయకోసం రోడ్లపై పడ్డారు.

గ్రేటర్ టిక్కెట్ కోసం ఆశావహులు బయోడేటాలు పుచ్చుకుని నేతల దయకోసం రోడ్లపై పడ్డారు. ఈ తాకిడి తట్టుకోలేక పార్టీ నాయకులు ఆఫీసులు, ఇళ్ల వద్ద భద్రతను పెంచుకుని తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఎంతో ఆశగా వెళ్లిన ఆశావహులు ఉసూరుమంటున్నారు. ఇప్పుడు రూటుమార్చి మీడియా కార్యాలయాల వద్ద కాపు కాస్తున్నారు. న్యూస్ ఛానల్స్ లో ఎన్నికల ప్రత్యేక చర్చా కార్యక్రమాలు పాలో అవుతూ....అది పూర్తయ్యే లోపు అక్కడ వాలిపోతున్నారు.  ‘సార్’ బయటకు వచ్చే వరకు మీడియా ఆఫీసు వద్దే కాపుకాస్తూ...దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఆఫీసులు, ఇళ్ల చుట్టూ తిరగడం కంటే ఇదే బాగుందంటూ ఆశావహులు చెప్తున్నారు.

ఈ దరఖాస్తుదారుల్ని అదుపుచేయడం నేతల గన్‌మెన్‌లకు తలనొప్పిగా మారింది. వాళ్ల చేతుల్లో తమ సార్ చిక్కకుండా తంటాలు పడుతున్నారు.
 - సాక్షి, సిటీబ్యూరో

Advertisement
 
Advertisement
Advertisement