ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్ పై స్టే | vemula rohit suicide case: high court stay on abvp students arrest | Sakshi
Sakshi News home page

ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్ పై స్టే

Feb 1 2016 2:04 PM | Updated on Aug 31 2018 8:24 PM

హెచ్ సీయూ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య కేసులో ముగ్గురు ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్ పై సోమవారం హైకోర్టు స్టే విధించింది.

హైదరాబాద్: హెచ్ సీయూ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య కేసులో ముగ్గురు ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్ పై సోమవారం హైకోర్టు స్టే విధించింది. సుశీల్, దివాకర్, కృష్ణ చైతన్యలను అరెస్ట్ చేయకుండా స్టే ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. దర్యాప్తు సహకరించాలని విద్యార్థులకు సూచించింది.

కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. హెచ్ సీయూ నుంచి సస్పెండ్ చేయడంతో రోహిత్ జనవరి 18న ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement