బయోటెక్నాలజీ సెంటర్ నెలకొల్పండి: వెలగపల్లి | velagapally demanded to estblish bio technology park | Sakshi
Sakshi News home page

బయోటెక్నాలజీ సెంటర్ నెలకొల్పండి: వెలగపల్లి

Apr 26 2016 4:02 AM | Updated on Sep 3 2017 10:43 PM

బయోటెక్నాలజీ సెంటర్ నెలకొల్పండి: వెలగపల్లి

బయోటెక్నాలజీ సెంటర్ నెలకొల్పండి: వెలగపల్లి

తెలంగాణ, ఏపీల్లో బయోటెక్నాలజీ సెంటర్ నెలకొల్పాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు కేంద్రాన్ని కోరారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల్లో బయోటెక్నాలజీ సెంటర్ నెలకొల్పాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు కేంద్రాన్ని కోరారు. సోమవారం లోక్‌సభలో ‘సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ బిల్లు-2016’పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పరిశోధనల్లో నాణ్యత ఉండాలంటే పరిశోధకులకు అత్యున్నత స్థాయిలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరముందన్నారు.

శాస్త్రవేత్తలు విదేశాలకు తరలివెళుతున్నారని, ఇందుకు మౌలిక వసతుల లేమి ఓ కారణమన్నారు. జెనెటిక్స్‌లో మరిన్ని పరిశోధనలు జరగాలని విజ్ఞప్తి చేశారు. కొత్త కొత్త వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వాటికి వ్యాక్సిన్లు కనిపెట్టడానికి చాలా కాలం పడుతోందని,. అందువల్ల పరిశోధనలకు తగిన నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement