వాహన తనిఖీల్లో రూ.6 లక్షలు స్వాధీనం | Vehicle checks Rs 6 lakh seized | Sakshi
Sakshi News home page

వాహన తనిఖీల్లో రూ.6 లక్షలు స్వాధీనం

Jan 27 2016 9:42 PM | Updated on Sep 2 2018 3:46 PM

వాహన తనిఖీల్లో రూ.6 లక్షలు స్వాధీనం - Sakshi

వాహన తనిఖీల్లో రూ.6 లక్షలు స్వాధీనం

వాహనాల తనిఖీలలో చైతన్యపురి పోలీసులు రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

చైతన్యపురి: వాహనాల తనిఖీలలో చైతన్యపురి పోలీసులు రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం అష్టలక్ష్మీ దేవాలయం రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో వచ్చిన వాసవికాలనీకి చెందిన వ్యాపారి పాపిశెట్టి వెంకటేశ్వరరావును ఆపి సోదా చేశారు.

కారులో రూ.6 లక్షలు నగదు ఉండడంతో డబ్బుకు సంబంధించిన వివరాలను అడిగారు. ఆయన ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు, ఐటీ అధికారులకు సమాచారం అందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు కావడంతో  తనిఖీలు ముమ్మరం  చేసినట్లు ఎస్ఐ కోటయ్య  తేలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement