హైకోర్టు తీర్పు చెంపపెట్టు: లక్ష్మణ్ | VC appointments on K. Laxman comments | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పు చెంపపెట్టు: లక్ష్మణ్

Jul 29 2016 3:01 AM | Updated on Aug 31 2018 8:31 PM

హైకోర్టు తీర్పు చెంపపెట్టు: లక్ష్మణ్ - Sakshi

హైకోర్టు తీర్పు చెంపపెట్టు: లక్ష్మణ్

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వీసీల నియామకాలను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు...

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వీసీల నియామకాలను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలోని వర్సిటీలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. గవర్నర్ ప్రమేయం లేకుండా వీసీలను నియమించడమే తప్పన్నారు.

నిబంధనలు, విధి విధానాలను తుంగలో తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలను కొట్టేసినా, పలు అంశాలపై మొట్టికాయలు వేసినా రాష్ట్రప్రభుత్వానికి సిగ్గు రావట్లేదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలను కోర్టులే తప్పు పడుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement