'ఆర్.కృష్ణయ్య దారి తప్పారు' | V. Hanumantha Rao comments on R.Krishnayya | Sakshi
Sakshi News home page

'ఆర్.కృష్ణయ్య దారి తప్పారు'

May 3 2014 2:10 PM | Updated on Aug 10 2018 8:06 PM

'ఆర్.కృష్ణయ్య దారి తప్పారు' - Sakshi

'ఆర్.కృష్ణయ్య దారి తప్పారు'

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీసీ నినాదం మోసపూరితమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి వీహెచ్ ఆరోపించారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీసీ నినాదం మోసపూరితమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి వీహెచ్ ఆరోపించారు. శనివారం వీహెచ్ హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం అంటున్న చంద్రబాబు అదే నినాదాన్ని సీమాంధ్రలో ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. సీమాంధ్రలోని బీసీలు టీడీపీకి మద్దతు పలికినా వారికి సీట్లు కేటాయించలేదని ఆయన ఆరోపించారు. దాంతో బీసీలపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటితో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు మాటలతో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య దారి తప్పారని వీహెచ్ అన్నారు. ఆ విషయాన్ని గ్రహించాలని ఆర్.కృష్ణయ్యకు వీహెచ్ హితవు పలికారు.  టీడీపీలో బీసీలకు చంద్రబాబు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వరని ఆయన గుర్తు చేశారు. గత అనుభవాలే అందుకు నిదర్శనమని వీహెచ్ ఆరోపించారు. డబ్బు, పదవులు ఎర వేసి చంద్రబాబు బీసీ నేతలను వాడుకుంటున్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement