గోల్కొండకు ఫిదా | upcoming actress priyanka fell in love with golkonda | Sakshi
Sakshi News home page

గోల్కొండకు ఫిదా

Aug 22 2014 1:20 AM | Updated on Sep 4 2018 5:07 PM

గోల్కొండకు ఫిదా - Sakshi

గోల్కొండకు ఫిదా

ఈ ఎక్స్‌పోలోని 75 స్టాల్స్‌లో కొలువుదీరిన వస్త్రాభరణాలు వేటికవే విభిన్నంగా ఉన్నాయి.

 ‘ఎత్తయిన కొండ... దానిపై దుర్భేద్యమైన కోట... గోల్కొండ చూసి ఫిదా అయ్యూ.
 అంత పెద్ద కోటను అసలెలా నిర్మించారో..! ఎన్నేళ్లు కష్టపడ్డారో..! తలుచుకుంటేనే ఆశ్చర్యం...
 ఆ వెంటనే ఆనందం’... అంటూ చెప్పుకొచ్చింది వర్ధమాన తార ప్రియూంక. ఈ అవ్ముడు
 నటించిన ‘ఐ యూమ్ ఇన్ లవ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అమీర్‌పేట కవ్ముసంఘం హాల్‌లో
 గురువారం ఏర్పాటు చేసిన ‘స్టైల్ అండ్ వీవ్స్ ఎక్స్‌పో’ ప్రారంభోత్సవంలో తళుక్కుమంది.
 ఈ సందర్భంగా పలకరించిన ‘సిటీ ప్లస్’తో హైదరాబాద్‌తో తన అనుబంధాన్ని పంచుకుంది...
 
సరిగ్గా ఏడో క్లాస్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌తో అనుబంధం మొదలైంది. నేను క్లాసిక్, ఫోక్, వెస్ట్రన్ డ్యాన్సర్‌ని. టీవీల్లో డ్యాన్స్ షోలు ఇవ్వడానికి తరచూ నగరానికి వచ్చిపోతుండేదాన్ని. ఇప్పుడు సినివూ చాన్స్ వచ్చింది. దీంతో  సిటీలోనే మకాం. సొంతూరు వైజాగ్ అరుునా... ఆరు నెలలుగా ఇక్కడే ఉంటున్నా. షూటింగ్‌లో భాగంగా గోల్కొండ కోటకు వెళ్లినప్పుడు నా కళ్లను నేనే నవ్ములేకపోయూ. కోటను అలా చూస్తూ ఉండిపోయూ. అప్పటి వరకూ ప్రత్యక్షంగా చూడలేదు. అంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేదు. జీవితాంతం అక్కడే ఉండాలన్నంతగా నచ్చేసింది నాకు. ఇట్స్ మై బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఆ తరువాత చార్మినార్ బాగా నచ్చింది. అక్కడ దొరికే గాజులు చాలా ఇష్టం.
 
విభిన్నం: ఈ ఎక్స్‌పోలోని 75 స్టాల్స్‌లో కొలువుదీరిన వస్త్రాభరణాలు వేటికవే విభిన్నంగా ఉన్నాయి. దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియుల్స్, చేనేతలు, కిడ్స్‌వేర్, గృహాలంకరణ వస్తువులు, బెడ్‌షీట్స్ వంటివెన్నో ఆకర్షణీయంగా ఉన్నాయి.  రూ.200 నుంచి రూ.30 వేల వరకు విలువ చేసే ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రియూంకతో పాటు ‘ఐ యూమ్ ఇన్ లవ్’ హీరో కిరణ్, సంగీత దర్శకుడు ప్రదీప్ పాల్గొన్నారు. ప్రదర్శన శనివారం వరకు కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement