
సాక్షి,హైదరాబాద్: గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. తాజాగా ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతోన్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
తారామతి మీదుగా మూసీ నది వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఇటీవల మంచిరేవుల గ్రేహౌండ్స్‌లోనూ చిరుత ప్రత్యక్షమైంది. 4 బోన్లు, ట్రాప్ కెమెరాలు పెట్టిన చిరుత చిక్కలేదు.ఇక సిటీలోపలికి చిరుత రావడం భయాందోళనకు గురిచేస్తోంది.
