20లోగా స్థానికత వివరాలివ్వండి | Two states Warning to the Doctors | Sakshi
Sakshi News home page

20లోగా స్థానికత వివరాలివ్వండి

Apr 14 2016 3:53 AM | Updated on Oct 9 2018 7:11 PM

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రభుత్వ డాక్టర్ల పంపిణీ చిక్కుముడిగా తయారైంది. ప్రధానంగా పబ్లిక్ హెల్త్, ఆయుష్, డెరైక్టర్ వైద్య ఆరోగ్య శాఖల్లోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ ముందుకు సాగడంలేదు.

♦ లేదంటే జీతాలు నిలిపివేస్తాం
♦ డాక్టర్లకు ఇరు రాష్ట్రాలు హెచ్చరిక
 
 సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రభుత్వ డాక్టర్ల పంపిణీ చిక్కుముడిగా తయారైంది. ప్రధానంగా పబ్లిక్ హెల్త్, ఆయుష్, డెరైక్టర్ వైద్య ఆరోగ్య శాఖల్లోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఇందుకు కారణం కొందరు డాక్టర్లు స్థానికతకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదని, మరి కొందరు ఇచ్చినప్పటికీ అందులో తప్పులున్నాయని గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 20లోగా స్థానికత వివరాలను అందజేయాలని, లేదంటే వచ్చే నెల 1న జీతాలు నిలిపివేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు చేపడతామని డాక్టర్లకు తెలంగాణ రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, ఏపీ పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి సంయుక్తంగా మెమో జారీ చేశారు. పదో తరగతికి ముందు ఏడేళ్ల పాటు ఎక్కడ చదువుకున్నారో ఆ వివరాలను తక్షణం అందజేయాలని మెమోలో స్పష్టం చేశారు. ఏపీకి చెందిన 250 మంది డాక్టర్లు తెలంగాణకు వెళ్తున్నారు. అలాగే తెలంగాణకు చెందిన 70 మంది ఏపీకి వెళ్లనున్నారు. దీనిపై తెలంగాణ డాక్టర్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక మరో 300 మంది డాక్టర్లు స్థానికత వివరాలను కమలనాథన్ కమిటీకి అందజేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement