సంక్రాంతికి మరో రెండు ప్రత్యేక రైళ్లు | Two special trains to secunderabad to kakinada for pongal 2016 | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి మరో రెండు ప్రత్యేక రైళ్లు

Jan 14 2016 5:50 PM | Updated on Sep 3 2017 3:41 PM

సంక్రాంతికి మరో రెండు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి మరో రెండు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరో రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం వెల్లడించింది.

హైదరాబాద్ : సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరో రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం వెల్లడించింది. సికింద్రాబాద్ - కాకినాడ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. అయితే ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు సరిపోవడం లేదంటూ తెలుగు ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో  తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లతోపాటు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు గురువారం ఫోనులో రైల్వే బోర్డు ఛైర్మన్కి విజ్ఞప్తి చేశారు. అందుకు రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement