నటుడు ప్రదీప్‌ ఆత్మహత్య | tv actor pradeep commits suicide in hyderabad | Sakshi
Sakshi News home page

నటుడు ప్రదీప్‌ ఆత్మహత్య

May 3 2017 12:20 PM | Updated on Nov 6 2018 7:53 PM

నటుడు ప్రదీప్‌ ఆత్మహత్య - Sakshi

నటుడు ప్రదీప్‌ ఆత్మహత్య

ప్రముఖ టీవీ నటుడు ప్రదీప్‌ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు.

హైదరాబాద్‌: ప్రముఖ టీవీ నటుడు ప్రదీప్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని తన నివాసంలో ఉరేసుకుని అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక గ్రీన్‌హోమ్స్‌ అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న ప్రదీప్‌ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ప్రదీప్‌ భార్య కూడా సీరియల్స్‌లో నటిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రదీప్‌ సప్త మాత్రిక, ఆరుగురు పతివ్రతలు తదితర సీరియల్స్‌తో పాటు పలు చిత్రాలలో కూడా నటించాడు. కుటుంబ కలహాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా ప్రదీప్‌  మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో పగిలి అద్దాలు చిందవవందరగా పడి ఉన్నాయి. మంగళవారం రాత్రి ప్రదీప్‌ ఓ బర్త్‌ డే పార్టీ కి హాజరైనట్టు తెలుస్తోంది. ప్రదీప్‌ భార్య పావనీ రెడ్డి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement