తుమ్మల ఖాళీచేసిన ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ | tummala nageswararao resigns mlc:Notification Issued for MLC Poll | Sakshi
Sakshi News home page

తుమ్మల ఖాళీచేసిన ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్

Sep 19 2016 4:08 PM | Updated on Sep 4 2017 2:08 PM

రోడ్లు, భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది.

హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్  సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 26 వరకూ నామినేషన్ల స్వీకరిస్తారు. అలాగే నామినేషన్ల స్వీకరణకు తుది గడువు అక్టోబర్ 3వ తేదీ. అక్టోబర్ 17న ఎన్నిక జరిపి అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి.

టీఆర్ఎస్ అభ్యర‍్థిగా ఫరీదుద్దీన్ను  ఆపార్టీ ఇప్పటికే ప్రకటించింది. కాగా ఎమ్మెల్సీగా  తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున రికార్డు మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement