టిడిపికి తుమ్మల నాగేశ్వర రావు రాజీనామా | Tummala Nageswara Rao resigned to TDP | Sakshi
Sakshi News home page

టిడిపికి తుమ్మల నాగేశ్వర రావు రాజీనామా

Aug 30 2014 3:44 PM | Updated on Aug 10 2018 8:08 PM

తుమ్మల నాగేశ్వర రావు - Sakshi

తుమ్మల నాగేశ్వర రావు

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఒకే ఒక వాక్యంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఆయన లేఖ రాశారు.ఆ లేఖను ఫాక్స్ ద్వారా చంద్రబాబుకు పంపారు. టిడికి రాజీనామా చేస్తున్నట్లు చెబుతూ తుమ్మల భావోద్వేగానికి గురయ్యారు. కంటతడిపెట్టుకున్నారు

తుమ్మలతోపాటు ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల, ఎమ్మెల్సీ బాలసాని, డిసిసిబి చైర్మన్ మువ్వ విజయ్ బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కవిత,  తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నాగచంద్రా రెడ్డి,  జిల్లాలోని మరి కొందరు ముఖ్య నేతలు కూడా టిడిపికి  రాజీనామా చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో టిడిపి దాదాపు తుడిచిపెట్టుకుపోయింది.  సెప్టెంబరు 5న తుమ్మల, ఆయన అనుచరులు టిఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement