టీఆర్ఎస్ గెలుపు.. హైదరాబాద్ కు మలుపు | trs wins ...changing to hyderabad | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ గెలుపు.. హైదరాబాద్ కు మలుపు

Feb 7 2016 3:29 AM | Updated on Sep 3 2017 5:04 PM

టీఆర్ఎస్ గెలుపు.. హైదరాబాద్ కు మలుపు

టీఆర్ఎస్ గెలుపు.. హైదరాబాద్ కు మలుపు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు హైదరాబాద్ వికాసానికి దోహదం చేస్తుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

ఆ పార్టీకి శుభాకాంక్షలు : టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు హైదరాబాద్ వికాసానికి దోహదం చేస్తుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ  తొలిసారి హైదరాబాద్ ప్రజలు స్థిరమైన తీర్పునివ్వడంతో టీఆర్‌ఎస్ పార్టీ సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటోందని తెలిపారు. భారీ విజయాన్ని సాధించిన టీఆర్‌ఎస్ పార్టీకి అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలిపారు. సెంట్రల్ వర్సిటీలో వివక్షకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్సిటీల్లో విద్యా హక్కుల పరిరక్షణకు జేఏసీ ప్రయత్నిస్తుందన్నారు. సర్కారు ప్రవేశపెట్టే బడ్జెట్‌పై జేఏసీ చర్చించి, కేటాయింపులపై ప్రభుత్వానికి సూచనలిస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement