టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంపై పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 27న ప్లీనరీ సమావేశం జరగాల్సి ఉంది.
ప్లీనరీ సమావేశంపై టీఆర్ఎస్ లో చర్చ
Apr 19 2016 6:08 PM | Updated on Sep 17 2018 7:53 PM
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంపై పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 27న ప్లీనరీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్లీనరీ సమావేశం నిర్వహించాలా వద్దా అనే ప్రశ్నలు తలెత్తాయి.
అయితే ప్లీనరీకి, నోటిఫికేషన్కు సంబంధం లేదని టీఆర్ వర్గాలంటున్నాయి. బహిరంగ సభకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకునే యోచనలో టీఆర్ఎస్ ఉంది. కాగా రెండు, మూడు రోజుల్లో ప్లీనరీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Advertisement
Advertisement