'హైకోర్టు విభజన ఎందుకు చేయడంలేదు' | trs mp jithender reddy on high court bifurcation | Sakshi
Sakshi News home page

'హైకోర్టు విభజన ఎందుకు చేయడంలేదు'

Dec 27 2017 12:38 PM | Updated on Dec 27 2017 12:38 PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా హైకోర్టు విభజన ఎందుకు జరగలేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి ప్రశ్నించారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా హైకోర్టు విభజన ఎందుకు జరగలేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల న్యాయవాదులు నష్టపోతున్నారన్నారు. అన్ని సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినా కేంద్రం హైకోర్టు విభజన చేయడం లేదన్నారు.

విభజన చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం హైకోర్టును తక్షణమే విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కొత్త రాష్ర్టాలు ఏర్పడినప్పుడు హైకోర్టు విభజనలో అప్పటి ప్రభుత్వాలు ఆలస్యం చేయలేదని ఎంపీ జితేందర్‌రెడ్డి గుర్తు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement