చైన్ స్నాచింగ్‌కు ఆగంతుకుల యత్నం | Tried to snacing chain in Hyderabad | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచింగ్‌కు ఆగంతుకుల యత్నం

Mar 16 2016 5:49 PM | Updated on Sep 4 2018 5:07 PM

మహిళ మెడలో పుస్తెలతాడును తెంపుకుపోయేందుకు ఇద్దరు ఆగంతకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

మహిళ మెడలో పుస్తెలతాడును తెంపుకుపోయేందుకు ఇద్దరు ఆగంతకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో స్నేహపురి కాలనీరోడ్ నంబర్14లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు జీఎహెచ్‌ఎంసీ స్వీపర్‌గా విధుల్లో ఉన్న శారద (58) అనే మహిళ మెడలోని పుస్తెలతాడును తెంపుకుపోయేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు వేయడంతో పరారయ్యారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement