తుది వరకు కాంగ్రెస్‌లోనే ఉన్న కాకా(వెంకటస్వామి) ఫొటోలను టీఆర్‌ఎస్ మీటింగుల్లో ఎలా పెట్టుకుంటారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు.
తుది వరకు కాంగ్రెస్‌లోనే ఉన్న కాకా(వెంకటస్వామి) ఫొటోలను టీఆర్‌ఎస్ మీటింగుల్లో ఎలా పెట్టుకుంటారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. ఫిరాయింపులను కూడా టీఆర్‌ఎస్ పండుగ మాదిరిగా జరుపుకుంటోందని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ రాజకీయ వ్యభిచారానికి లెసైన్స్ ఇచ్చేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. అల్లుడు హరీష్, కొడుకు కేటీఆర్ మధ్య వారసత్వ పోరు అధికార పార్టీలో ఉన్నట్లుందని పేర్కొన్నారు. కారు గుర్తుపై గెలిచిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌ను సమర్ధించుతున్నట్లు కనిపిస్తోందని మల్లు రవి చెప్పారు.