పర్యాటక అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు | Tourism development in telangana | Sakshi
Sakshi News home page

పర్యాటక అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు

Mar 22 2016 10:46 AM | Updated on Aug 11 2018 7:56 PM

సమైక్య పాలనలో తెలంగాణ టూరిజం గుర్తింపునకు నొచుకోలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : సమైక్య పాలనలో తెలంగాణ టూరిజం గుర్తింపునకు నొచుకోలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ...  ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కట్టడాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎ.చందూలాల్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని వివరించారు. అందులోభాగంగా హెలీ టూరిజం ఏర్పాటు చేసిన విషయాన్ని చందూలాల్ గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement