నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష | Today is Constable exam | Sakshi
Sakshi News home page

నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష

Oct 23 2016 2:20 AM | Updated on Mar 19 2019 5:52 PM

నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష - Sakshi

నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పోలీసు కానిస్టేబుల్ (సివిల్/ ఏఆర్/ ఎస్‌ఏఆర్/ టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్

⇒రాష్ట్రవ్యాప్తంగా 153 పరీక్ష కేంద్రాలు
⇒9,281 పోస్టులకు 81,523 మంది
⇒అభ్యర్థుల పోటీ


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పోలీసు కానిస్టేబుల్ (సివిల్/ ఏఆర్/ ఎస్‌ఏఆర్/ టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్ష నిర్వహించనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే రాత పరీక్షకు నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతిం చమని బోర్డు స్పష్టం చేసింది.

ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపింది. మొత్తం 9,281 పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 153 కేంద్రాల్లో 81,523 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతోపాటు హాల్ టికెట్‌తో హాజరు కావాలని అధికారులు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement