సీనియర్ పోలీసు అధికారుల సర్వీసు పొడిగింపు | the service extension of senior police officers | Sakshi
Sakshi News home page

సీనియర్ పోలీసు అధికారుల సర్వీసు పొడిగింపు

Sep 19 2014 2:47 AM | Updated on Sep 2 2017 1:35 PM

రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ పోలీసు అధికారుల సర్వీసును రెండు సంవత్సరాల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ పోలీసు అధికారుల సర్వీసును రెండు సంవత్సరాల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇంటెలిజెన్స్ విభాగంలో పొలిటికల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి కిషన్‌రావు, యాంటీ నక్సలైట్ నిఘా విభాగంలో నాన్‌కేడర్ ఎస్పీగా పనిచేస్తున్న నర్సింగ్‌రావు, ఇంటెలిజెన్స్ హైదరాబాద్ రీజినల్ అధికారి, అదనపు ఎస్పీ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సర్వీసు పొడిగించిన జాబితాలో ఉన్నారు. ఇందులో కిషన్‌రావు ఇంటెలిజెన్స్ ఎస్పీగా 2003లోనే పదవీవిరమణ చేయాల్సి ఉంది. అయితే నిఘా విభాగంలో అపార అనుభవం కలిగి, అత్యంత సమర్థుడిగా పేరు పొందిన కిషన్‌రావు సేవలు అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు 2003 నుంచి పొడిగిస్తూ వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement