breaking news
Senior police officers service
-
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్, ప్రస్తుత పోలీస్ ఉన్నతాధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగించింది. 26 మందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ తొలగించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ తీసేసింది. పలువురు రాజకీయ నేతలు, పోలీస్ అధికారుల గన్మెన్ల సంఖ్య తగ్గించింది. 67 మంది ప్రముఖుల గన్మెన్లను తగ్గించిన పోలీస్ శాఖ.. చాలా వరకు వన్‌ప్లస్, వన్ గన్‌మెన్లకే పరిమితం చేసింది. -
సీనియర్ పోలీసు అధికారుల సర్వీసు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ పోలీసు అధికారుల సర్వీసును రెండు సంవత్సరాల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇంటెలిజెన్స్ విభాగంలో పొలిటికల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి కిషన్‌రావు, యాంటీ నక్సలైట్ నిఘా విభాగంలో నాన్‌కేడర్ ఎస్పీగా పనిచేస్తున్న నర్సింగ్‌రావు, ఇంటెలిజెన్స్ హైదరాబాద్ రీజినల్ అధికారి, అదనపు ఎస్పీ జగన్మోహన్రెడ్డి ఈ సర్వీసు పొడిగించిన జాబితాలో ఉన్నారు. ఇందులో కిషన్‌రావు ఇంటెలిజెన్స్ ఎస్పీగా 2003లోనే పదవీవిరమణ చేయాల్సి ఉంది. అయితే నిఘా విభాగంలో అపార అనుభవం కలిగి, అత్యంత సమర్థుడిగా పేరు పొందిన కిషన్‌రావు సేవలు అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు 2003 నుంచి పొడిగిస్తూ వస్తున్నాయి.


