తల్లి ఒడికి చేరిన సరోగసీ చిన్నారి | The sagacious baby reached the mother on Thursday after 4 days. | Sakshi
Sakshi News home page

తల్లి ఒడికి చేరిన సరోగసీ చిన్నారి

Jul 28 2017 2:31 AM | Updated on Oct 17 2018 5:43 PM

సరోగసీ ద్వారా జన్మించి, అనారోగ్యంతో నిలోఫర్‌ ఆస్ప త్రిలో చికిత్స పొందిన శిశువు 4రోజుల తర్వాత గురువారం తల్లి చెంతకు చేరింది.

సాక్షి, హైదరాబాద్‌: సరోగసీ ద్వారా జన్మించి, అనారోగ్యంతో నిలోఫర్‌ ఆస్ప త్రిలో చికిత్స పొందిన శిశువు 4రోజుల తర్వాత గురువారం తల్లి చెంతకు చేరింది. మహబూబ్‌నగర్‌కు చెందిన మహిళ సరో గసీ ద్వారా గర్భందాల్చి.. ఈ నెల 20న పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలి సిందే.

పుట్టిన బిడ్డ నిలోఫర్‌లో చికిత్స పొందుతుండగా, అద్దె గర్భం పేరుతో మోసపోయిన బాధితురాలు పేట్లబురుజు ఆస్పత్రి అత్యవసర విభాగానికే పరిమి తమైంది. పాప ఆరోగ్యం మెరుగుపడటం తో ఆస్పత్రి నుంచి డిశ్చార్జిచేసి, పేట్లబు రుజు ఆస్పత్రిలో ఉన్న తల్లికి అప్పగిం చారు. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. ఇదిలా ఉంటే సరోగసీ అంశంపై వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసుల నుంచి ఓ స్పష్టత వచ్చే వరకు తల్లీపిల్లలను ఆస్పత్రిలోనే ఉంచనున్నట్లు పేట్లబురుజు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగమణి తెలిపారు. ఆ తర్వాతే వారిని డిశ్చార్జి చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement