హయత్‌నగర్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హయత్‌నగర్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు దాటుతున్న చిన్నారి సంజనను, ఆమె తల్లిని మృత్యుముఖంలోకి నెట్టేసిన కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వెంకటరమణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అతనితోపాటు కారులో ఉన్న యాదిరెడ్డి, శ్రీనివాసరెడ్డిని కూడా మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కాగా, చిన్నారి సంజన, ఆమె తల్లి పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు చెబుతున్నారు.