చలిః 10.5 | The minimum temperature hyderbad | Sakshi
Sakshi News home page

చలిః 10.5

Jan 13 2015 12:23 AM | Updated on Sep 2 2017 7:36 PM

చలిః  10.5

చలిః 10.5

ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు, అనూహ్యంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో గ్రేటర్ సిటిజన్లు గజగజలాడుతున్నారు.


సిటీబ్యూరో: ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు, అనూహ్యంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో గ్రేటర్ సిటిజన్లు గజగజలాడుతున్నారు. సోమవారం కనిష్టంగా 10.5 డిగ్రీలు, గరిష్టంగా 28.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 25 శాతానికి తగ్గింది.

చలిగాలులతో చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారు అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాగల 24 గంటల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బేగంపేటలోని వాతావరణ కేంద్రం తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement