ఈ రోజుల్లో మొబైల్‌ఫోన్ లేని ఊరుందా? ఇంజక్షన్ అంటే తెలియని ప్రజలున్నారా? ప్రపంచమే ఓ కుగ్రామమైన వేళ ఇంకా అలాంటి గ్రామాలేంటి అంటారా?.. కానీ, అటువంటి గ్రామం ఉంది. అక్కడి ప్రజలకు మందులు తెలియవు. స్కూల్ మాట దేవుడెరుగు.. ఆ ఊరికి విద్యుత్తే లేదు. చుట్టూ గుట్టలు, లోయలు.
కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం. మేనిని తాకుతూ వెళ్లే మేఘాలు. స్వచ్ఛమైన నీటితో ఉరకలెత్తే సుఫిన్ నది. ఆత్మీయత నిండిన మనసులు. శ్రమే దైవంగా బతికే మనుషులు ఆ ఊరి సొంతం. ఆ గ్రామం పేరు కలాప్. ఆ అందాలను తన కెమెరాలో బంధించి ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఆనంద్‌శంకర్.
..:: శ్రావణ్ జయ
అబ్బురపరిచే ప్రకృతి ఉత్తరాఖండ్ జిల్లాలోని ఉత్తర కాశీలో ఉన్న కలాప్ సొంతం. 450 జనాభా ఉన్న ఆ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. గ్రామస్తులకు ఆదాయమార్గం అంటే మేకలు, గొర్రెల పెంపకమే. ఆ ఊరికి హస్పిటల్, స్కూల్, కరెంటు వంటివేవీ లేవు. వాటి గురించి అక్కడ ప్రజలకూ తెలియదు. రహదారుల వంటి మౌలిక సదుపాయాలు అసలే లేవు. ప్రభుత్వం అంటేనే తెలియదు అక్కడి ప్రజలకు. అలాంటివారిలో చైతన్యం కల్పించి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్నాడు ఆనంద్ శంకర్.
బిజినెస్ స్టాండర్డ్‌లో జర్నలిస్ట్ వృత్తికి స్వస్తి చెప్పి, సొంతూరు బెంగళూరును వదిలి కలాప్లోనే నివాసముంటున్నాడు. ఆ ప్రజల జాగృతి కోసం ‘కలాప్ ట్రస్ట్’ను ప్రారంభించాడు. అక్కడి అందాలను కెమెరాల్లో బంధించి, ఆ గ్రామం గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఇటీవల నగరంలోని లామకాన్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశాడు. ఎగ్జిబిషన్ ఏర్పాటు ఉద్దేశం ఆయన మాట ల్లోనే...
‘చుట్టూ ప్రకృతి సోయగం ఎంత ఉన్నా ఆ ఊరును ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణం ప్రచారం లేకపోవడమే. ప్రభుత్వం, ప్రైవే టు సంస్థలు కలాప్ను సందర్శించిన దాఖలాల్లేవు. నేను 2013లో ఆ ఊరికి వెళ్లాను. గొర్రెలు, మేకల పెంపకం తప్ప ఆ గ్రామానికి ఎలాంటి ఆదాయ మార్గం లేదు. కలాప్ ప్రజల భాష కూడా మౌఖికమే తప్ప లిఖిత పూర్వకమైనది కాదు. స్వతహాగా ఫోటోగ్రాఫర్నైన నేను అక్కడి ప్రకృతి సోయగాలకు ముగ్ధుడయ్యాను.
అప్పుడే ఫొటోల ద్వారా ఆ ఊరికి ప్రచారం కల్పించాలన్న ఆలోచన వచ్చింది. ప్రస్తుతం అక్కడి అందమైన లొకేషన్లను ఫొటోల్లో బంధించి వాటిని కలాప్ ట్రస్ట్ దార్వా విక్రయించి, వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నా. అక్కడి ఇళ్లు చూస్తే అక్కడి ఆర్కిటెక్చర్ ఎంత సంపన్నమైనదో తెలుస్తుంది. అందుకే వారికి ఇతర చేతి వృత్తులను నేర్పిస్తున్నాను. 2014 అక్టోబర్‌లో అక్కడ తొలిసారిగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం.
ఎక్కువమంది విటమిన్ బీ12 లోపం, ఎనీమియాతో బాధపడుతున్నారు. కలాప్ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వారి అభ్యున్నతికే ఖర్చు చేస్తాం. ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా... నా ఫొటోల ప్రచారంతో ఆ ఊరికి యాత్రికులు, పర్వతారోహకులు కచ్చితంగా వస్తారు. టూరిజం అభివృద్ధి అవుతుంది. అందమైన ప్రకృతికి నిలయమైన కలాప్లో షూటింగ్ స్పాట్స్‌కి కొదవ లేదు. సినిమా వాళ్లు కూడా రావడం వల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అనుకుంటున్నా’.
ట్రెక్కింగ్‌కి అనుకూలం...
శీతాకాలంలో 3 నుంచి ఐదడుగుల మేర మంచుతో కప్పి ఉండే కలాప్ డెహ్రడూన్‌కి 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిల్లీకి 450 కిలోమీటర్ల దూరం. కలాప్ సమీపంలోని నెట్వార్కి కారులో వెళ్లడానికి 6 గంటలు, బస్సులోనైతే పది గంటలు పడుతుంది. ట్రెక్కింగ్‌కి రెండు మార్గాలున్నాయి. వేసవి కాలం మార్గంలో 8 కిలోమీటర్లు నడవడానికి 6 గంటలు పడుతుంది. శీతాకాలం మార్గంలో 5 కిలోమీటర్లు నడిచేందుకు 4 గంటల సమయం పడుతుంది.
# Tag
Related news
-
మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!
ఎర్లీ మార్నింగ్ కాస్త కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. పొద్దుపొద్దునే కాఫీ గుమాళింపుతో ముక్కుపుటలకు తాకుతుంటే అబ్బా ప్రాణం లేచించింది అనిపిస్తుంది. చాలా మందికి ఇది తాగితే చాలు టిఫిన్లతో కూడా పనిలేదు. అలాంటి కాఫీ ఎలా మన దైన జీవితంలో భాగమయ్యింది?. ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా!. మనం ఎంతో ఇష్టంగా తాగే కాఫీని ఎనిమిదవ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారట. దీన్ని కనిపెట్టింది ఒక మేకల కాపరి అట. మేకల కాపరి కాఫీని తయారు చేయడమేమిటి? అనే కదా..!. ఆఫ్రికాకి చెందిన ఆ మేకల కాపరి ప్రతిరోజు మేకలను మేపుకుంటూ బయటకు వెళ్తుండేవాడు. ఒకరోజు ఎప్పటిలా మేకలను బయట మేపుకుని పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు. అందులో ఓ మేకపిల్ల చాలా డల్‌గా ఉండేదట. అయితే మరుసటి రోజు కూడా యథాలాపంగా మేతకు వెళ్లి వచ్చిన తర్వాత చూస్తే..అదే మేకపిల్ల చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ తర్వాత రోజు కూడా.. అదే మేకపిల్ల మరింత ఉత్సాహంగా గంతులు వేయడం చూసి ఏంటిదీ అని విస్తుపోతాడు. అసలు ఏం చేస్తుంది..? ఈ మేకపిల్ల. మాములుగా మేతకు వెళ్లి ఇంటికి వచ్చాక కాస్త చలాకితనం తక్కువుగా ఉంటుంది. కానీ ఈ మేకపిల్ల మొదట్లో చాలా డల్‌గా అయిపోయి రాను రాను ఎలా ఉత్సాహంతో ఉరకలేస్తోంది?.. అసలు ఇది ఏం తింటుంది..?, ఏం చేస్తుంది..? తెలసుకోవాలన్న ఆరాటంతో.. దాన్ని గమినించడం మొదలు పెట్టాడు. ఆ మేక అడవిలో ఉండే ఓ మొక్క గింజలను ఎక్కువుగా తినడం చూశాడు. దీన్ని తినడం వల్లే ఈ మేకపిల్ల యాక్టివ్‌గా ఉంటుందేమో..! అన్న అనుమానంతో ఆ మేకల కాపరి ఆ గింజలను కోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అతడు వాటిని పౌడర్ చేసుకుని నీటిలో కలుపుకుని తాగాడు. ఎంతో రుచిగాను, పైగా తాగాక ఏదో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు ఉండటం గమనించాడు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు ఈ గింజలు చూపించి అసలు విషయం చెబుతాడు. అయితే ఎవ్వరూ ఈ గింజలను తినేందుకు మొదట్లో సాహసం చేయలేదు. అయితే అతను తాగినా ఏం కాలేదు, పైగా హుషారుగా ఉంటున్నాడు కదా! అని నెమ్మదిగా వాళ్లు కూడా తాగడం ప్రారంభిస్తారు. అలా క్రమక్రమంగా కాఫీగా తయారయ్యింది. అలా మొదలైన కాఫీ ప్రయాణం ప్రపంచ దేశాలన్నింటికీ చేరింది. ఇంతకీ ఈ మేక తిన్న గింజలు ఏంటంటే..కాఫీ బీన్స్ గింజలట. అలా మేక నుంచి కాఫీ గురించి మానవులకు తెలిసిందిట. ఆ తర్వాతా ఆ కాఫీ మన దైనందిన జీవితంలో భాగమైపోయిందట. (చదవండి: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!) -
మేకలకు ఏడాది జైలు శిక్ష! ఏం తప్పు చేశాయో వింటే షాకవ్వుతారు!
మనుషులకు విధించినట్లు జంతువులకు కూడా జైలు శిక్షలు విధిస్తారని విన్నారా?. ఔను! ఇది నిజం. ఇక్కడొక దేశం మేకలకు అలానే శిక్ష విధించి వార్తల్లో నిలిచింది. ఏం తప్పు చేశాయని అంత పెద్ద శిక్ష విధించారో తెలిస్తే షాకవ్వుతారు. ఇదేం విడ్డూరం రా బాబు..! అనుకోకండి. ఇలాంటివి అక్కడ మాములేనట. పాపం ఆ మేకలు ఒకటి రెండు రోజులు కాదు ..ఏకంగా ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించాయి. వివరాల్లోకెళ్తే..ఈ వింత ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. షహరియార్ సచిబ్ రాజీబ్‌కి చెందిన తొమ్మిది మేకులడిసెంబర్ 6, 2022న స్మశాన వాటికలో చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయని అరెస్టు చేశారు అధికారులు. అలా అప్పటి నుంచి బారిసాల్‌లో బార్ల వెనుక ఆ మేకలు బంధీలుగా ఉండిపోయాయి. వాటి యజమాని వాటిని విడుదల చేసేందుకు పలు విధాల యత్నించి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇటీవలే ఎన్నికైన బరిషల్ సిటీ కార్పొరేషన్ మేయర్‌ని సంప్రదించి తన గోడును చెప్పుకున్నాడు. దీంతో ఆయన చొరవ కారణంగా బంగ్లాదేశ్ అడ్మనిస్ట్రేటివ్ అదికారులు రాజీబ్‌కు తొమ్మిది మేకలను విడుదల చేసి తిరిగి అప్పగించారు. దాదాపు ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బంధిఖానా నుంచి విముక్తి పొందాయి ఆ తొమ్మిది మేకలు. ఇలా జంతువులకు శిక్ష విధించిన ఘటన మొదటిది కాదు. రష్యాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కోమి ప్రావిన్స్‌లో సిక్టివ్కర్ నగరంలోని జైలులో ఓ పిల్లి అక్రమంగా ఫోన్లు, గాడ్జెట్లు రవాణ చేస్తుందని అరెస్టు చేసి బంధించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌ల్లో కూడా ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. ఓ ఎనిమిది గాడిదలు లక్షలు విలువ చేసే మొక్కలను తినేశాయని అరెస్టు చేసి జైల్లో పడేశారు. Nine goats freed after one year in jail for eating grass in Barishal graveyard!#Bangladesh #barishal https://t.co/8vLLSSOgRf — UNB - United News of Bangladesh (@unbnewsroom) November 24, 2023 (చదవండి: ఆ లాటరీ టికెట్ వెయిటర్ జీవితాన్ని తలకిందులు చేసి చిక్కుల్లో పడేసింది!) (మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానెల్‌పై క్లిక్ చేయండి) -
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్‌కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్‌ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి..
మహరాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో మానవత్వం మంటగలిసే ఉదంతం చోటుచేసుకుంది. మేకలను, పావురాలను చోరీ చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అహ్మద్‌నగర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాము విచారణ చేపట్టి, ఈ దుశ్చర్యకు పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన ఐదుగురు పరారయ్యారని తెలిపారు. ఈ ఘటన దరిమిలా దీనికి నిరసనగా హరేగావ్లో బంద్ పాటించారు. స్థానిక విపక్ష కాంగ్రెస్ ఈ ఘటనకు బీజేపీ వ్యాపింపజేస్తున్న విద్వేషమే కారణమని ఆరోపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 25న గ్రామానికి చెందిన నలుగురు దళితయువకుల ఇళ్లలోకి చొరబడిన ఆరుగురు యువకులు బలవంతంగా వారిని బయటకు తీసుకువచ్చారు. బాధిత యువకుల వయసు 20 ఏళ్లకు అటునిటుగా ఉంటుంది. ఆ యువకులు మేకలు, పావురాలు దొంగిలించారని ఆరోపిస్తూ, వారిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో విపరీతంగా కొట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను యువరాజ్, మనోజ్, పప్పు పార్ఖే, దీపక్, దుర్గేష్, రాజులుగా గుర్తించారు. ఈ నిందితులలో ఒకరు ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. తరువాత దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితులను స్థానికులు సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. బాధితులలో ఒకరైన శుభం మగాడే జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు నిందితులపై సెక్షన్ 307 (హత్యాయత్నం),360 (కిడ్నాప్), ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ ఈ ఉదంతం మానవత్వానికే మాయనిమచ్చ అని అన్నారు. నిందితులు ఎంతటివారైనా వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అధికార బీజేపీ దళితులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యిందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
సంకర జాతి మేకల బిజినెస్.. లాభాలు ఆర్జిస్తున్న ఎన్నారై రైతు
ఓ ప్రవాస భారతీయుడు చొరవతో మేలైన సంకరజాతి మేకల జాతిని ఉత్పత్తి చేశారు. ఇది మాంసోత్పత్తికి, పాల దిగుబడికి రెండు విధాలుగా ఉపయోగపడే మేకల జాతి కావడం విశేషం. వేగంగా పెరగడంతో పాటు రుచికరమైన మాంసాన్ని అందిస్తుంది. ఈ జాతి మేకలు రోజుకు రెండు లీటర్ల వరకు పాలు కూడా ఇస్తుండటంతో రైతుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రరల్ మండలం భట్లపాలెం చెందిన కె.నాగేశ్వరరావు 21 ఏళ్లుగా సింగపూర్‌లో ఓ నిర్మాణ సంస్థలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో స్వస్థలానికి వచ్చిన ఆయన ఇక్కడే వ్యవసాయాన్ని వాణిజ్య స్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం ఆక్వా సాగు చేసిన తర్వాత మేకల పెంపకంపై దృష్టిసారించారు. మేలైన విదేశీ మేకలను తీసుకువచ్చి స్థానిక మేకలతో క్రాసింగ్ చేయించారు. అమలాపురం సమీపంలోని కామనగరువులోని వ్యవసాయ క్షేత్రంలో వీటిని పెంచుతూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. దక్షిణాఫ్రికా బోయర్ రకం ఇటు మాంసం ఉత్పత్తికి, అటు పాల దిగుబడికి ఉపయోగపడే దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ రకం మేకల మాంసం రుచిగా ఉంటుంది. వేగంగా పెరుగుతుంది. ఒక్కోటి రూ.3 లక్షల వ్యయంతో దక్షిణ ఆఫ్రికా బోయర్ రకం విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకున్నారు. ఈ పొట్టేలు బరువు ఏకంగా 140 కేజీల వరకు ఉంటుంది. ఆ జాతి విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకొని స్థానిక జాతులతో సంకరం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని భావించారు. ఆ విధంగానే పొటేళ్లను దిగుమతి చేసుకొని.. రాజస్థాన్‌కు చెందిన అజ్మీర్, సిరోహి, కేరళకు చెందిన తలచేరి, పంజాబ్‌కు చెందిన బిటిల్ రకాల మేకలతో సంకరం చేయించారు. దీంతో ప్రయోగం విజయవంతమైంది. 8 నెలల్లోనే 40 కిలోలు.. తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ క్రాస్ బ్రీడ్ (సంకర జాతి) మేకల సంతతి స్థానిక రకాల కన్నా వేగంగా బరువు పెరుగుతున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక దేశవాళి మేక రెండేళ్లలో గరిష్ఠంగా 40 కేజీలు బరువు పెరుగుతుంది. ఈ సంకరజాతి మేక 8 నెలల్లోనే ఈ బరువుకు పెరుగుతోంది. రెండేళ్లలో 70 కేజీలవుతోంది. ఆడ మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తోందని ఆయన వివరించారు. ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో సంకర జాతి మేకలు పెంచుతున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యహారమే అయినా మేకలు 2–3 రెట్ల బరువు పెరుగుతాయి. నాణ్యమైన, రుచికరమైన మాంసం ద్వారానే కాకుండా, పాల ద్వారా రోజువారీ ఆదాయాన్ని పొందే అవకాశముంది. బోయర్ జాతి లక్షణాలు 100 శాతం స్థానిక బ్రీడ్‌లో తెప్పించే దిశగా ప్రయత్నిస్తున్నారు. క్రాస్ బ్రీడింగ్ ద్వారా వచ్చే సంతతిని రైతులకు ఒక పొట్టేలుకు 20 మేకలను యూనిట్‌గా విక్రయిస్తున్నారు. మాంసం రిటెయిల్ విక్రయించడానికి అవుట్లెట్ ఏర్పాటు చేయబోతున్నామని నాగేశ్వరరావు వివరించారు. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ చేస్తే జబ్బుల బారినపడే అవకాశం చాలా తక్కువని నాగేశ్వరరావు అన్నారు. – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం నాణ్యమైన బ్రీడ్ అభివృద్ధే లక్ష్యంమన ప్రాంతంలో దేశవాళీ మేక మాంసం కన్నా నాణ్యమైన, రుకరమైన మాంసం అందించే సంకర జాతి బ్రీడ్‌ను అందుబాటులోకి తేవాలన్నదే నా కోరిక. విదేశీ బ్రీడ్ మేక పిల్లలను దిగుమతి చేసుకొని ఇక్కడ పెంతే స్థానిక వాతావరణానికి ఎంతగా తట్టుకుంటాయో చెప్పలేం. అందుకే దక్షిణాఫ్రికా బోయర్ రకంతో స్థానిక రకాలను సంకరం చేసి కొత్త బ్రీడ్‌ను రపొందిస్తున్నాం. తద్వారా మేలు రకం వంసం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఈ సంకర జాతి మేకలు పూర్తిస్థాయిలో బోయర్ గుణగణాలను సంతరించుకునేందుకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ సంకరజాతి మేకలు స్థానిక వాతావరణాన్ని తట్టుకుంటాయి. – కె. నాగేశ్వరరావు (99235 44777), కామనగరువు, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి ఉత్పత్తి స్థానిక దేశవాళీ మేకల పెంపకం కన్నా మేలైన రకాల నుంచి ఉత్పత్తి అయ్యే సంకర జాతి మేకలు త్వరగా ఎదుగుతాయి. నాణ్యమైన మాంసం ఉత్పత్తి అవుతుంది. రైతు నాగేశ్వరరావు శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి మేకలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జాతి ద్వారా మేకల పెంపకందారులు అధిక మాంసం, పాల దిగుబడి సాధించే అవకాశముంది. – విజయ రెడ్డి, సహాయ సంచాలకులు, పశు సంవర్ధక శాఖ, అమలాపురం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్.
Related News by category
-
నామినేషన్ల దాఖలు ఇలా
సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. 18వ లోక్‌సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా...రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం ముహూర్తాలను అన్వేషిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తారు. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్‌ను ప్రతిపాదించాలి. అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్‌ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో అఫిడవిట్‌పై అతికించాలి. ● నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటో అతికించాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేర్వే పార్లమెంట్ సెగ్మెంట్‌కు చెందిన వారైనచో విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ● రిజస్టర్/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్ –3లో సి కాలం ఎదురుగా ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యతాక్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపర్చాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉంది. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. శుభ ముహూర్తాలు ఇవే.. ● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు. ● 24న బుధవారం చైత్ర బహుళ పౌడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే..అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. జాతకాలతో ముందుకు... ● నిజానికి 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం..పై ముహూర్తాల కంటే ఇది మెరుగైనది. కానీ ఆ రోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. అభ్యర్థులు సూత్రప్రాయంగా శుభముహూర్తాలను ఖరారు చేసుకున్నా..మరొకసారి తమ జాతక బలానికి అనుగుణంగా నామినేషన్లను దాఖలు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు రెండు, మూడు ముహూర్తాలను కూడా ఖరారు చేసుకున్నారు. వీటిలో ఏదో ఒక దానిపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఆ మేరకు తొలుత ఒక సెట్టు నామినేషన్ వేసే చాన్స్ ఉంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ఊరేగింపుగా నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు కూడా బయటికి వెళ్లేందుకు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరు సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా ● నేడే లోక్‌సభ ఎలక్షన్ నోటిఫికేషన్..ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల ఏర్పాట్లు లోక్‌సభ స్థానం రిటర్నింగ్ సెంటర్ హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీసు, లక్డీకాపూల్ సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు (సికింద్రాబాద్) మల్కాజ్గిరి మేడ్చల్ కలెక్టరేట్ చేవెళ్ల తహసీల్దార్ ఆఫీసు, రాజేంద్రనగర్ ● ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ● ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ● సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ● ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ● ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల ● మే 13న ఎన్నికల నిర్వహణ, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ● జూన్ 6న ఎన్నికల ప్రకియ ముగింపు చేవెళ్ల లోక్‌సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 22 బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ 19 కాంగ్రెస్ గడ్డం రంజిత్‌రెడ్డి 25 హైదరాబాద్ లోక్‌సభ స్థానం బీజేపీ మాధవీలత 24 బీఆర్ఎస్ జి.శ్రీనివాస్‌యాదవ్ 22 ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ 19సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ జి.కిషన్‌రెడ్డి ఏప్రిల్ 19 బీఆర్ఎస్ పద్మారావుగౌడ్ 19 కాంగ్రెస్ దానం నాగేందర్ 24 మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం బీజేపీ ఈటల రాజేందర్ 18 బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి 22 కాంగ్రెస్ పట్నం సునీతారెడ్డి 22 కంటోన్మెంట్‌లోనూ... కంటోన్మెంట్: లోక్‌సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి కూడా గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ తెలిపారు. కంటోన్మెంట్లో 113 ప్రాంతాల్లో 232 పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు. ఇక్కడ మొత్తం 2,51,370 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,25,735 మంది, మహిళలు 1,25,627 మంది, ఇతరులు 8 మంది, సర్వీసు ఓటర్లు 55 మంది ఉన్నారని చెప్పారు. నామినేషన్లను కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి స్వీకరిస్తారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉపఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్ల తర్వాత ప్రచారం ఉధృతం చేసే అవకాశం ఉంది. -
సీతారామం
భాగ్యనగరం..పురానాపూల్ వద్ద శోభాయాత్రలో పాల్నొన్న భక్తులుజై శ్రీరామ్ నినాదాలతో నగరం మార్మోగింది. బుధవారం శ్రీరామనవమి వేడుకలు గ్రేటర్ వ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో రాములోరి పెళ్లి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం తర్వాత అన్నిచోట్లా అన్నదానం చేశారు. ఇక భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మక సీతారామ్‌బాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర భక్తుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, జెండాలు, ఆటపాటల కోలాహలం మధ్య కోఠి హనుమాన్ టేక్డి వరకు సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్‌పేట్ గంగాబౌలి, ఆకాష్‌పురి హనుమాన్ ఆలయం నుంచి, ఆనంద్‌సింగ్ ఆధ్వర్యంలో మంగళ్‌హాట్ మాగ్రా నుంచి కూడా శోభాయాత్రలు చేపట్టగా..ఇవి మూడు లక్షలాది మంది రామభక్తుల సందడి మధ్య హనుమాన్ టేక్డికి చేరుకున్నాయి. భారీ శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలు, కాషాయ రంగు జెండాలు, బైకులపై యువత విన్యాసాలతో శోభాయాత్ర ఆద్యంతం అత్యంత కోలాహలంగా జరిగింది. – అబిడ్స్ -
డోర్ నెంబర్లూ డొల్లే !
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్నెంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్నెంబర్తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్‌నెంబర్‌తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్ నెంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినెంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నెంబర్లు వేయడమో చేసి ఆ ఇంటినెంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్లైన్లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినెంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్ ఇంటినెంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకే కుటుంబం...పోలింగ్ కేంద్రాలెన్నో ! సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్‌దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. డూప్లికేట్ ఔట్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం 2023 జనవరి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది. ఒకే నియోజకవర్గం పరిధిలో ఒకేవిధమైన ఫొటోలు, ఒకే విధమైన పేర్లతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల జాబితాలో పేరున్న వారిని గుర్తించి తొలగించారు. అలా 54,259 మంది పేర్లు డూప్లికేట్‌గా ఉండటాన్ని గుర్తించి తొలగించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. వారితో పాటు చిరునామా మారినప్పటికీ, మరణించిన వ్యక్తుల పేర్లు కూడా జాబితాలో ఉండటాన్ని గుర్తించి అలాంటి వాటినీ తొలగించారు. వెరసి మొత్తంగా 5,41,201 ఓట్లు తొలగించారు. సాగర్‌లో ‘పంపింగ్’ ట్రయల్ రన్ షురూ.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో అత్యవసర పంపింగ్ కోసం జలమండలి ట్రయల్‌రన్‌ను ప్రారంభించింది. బుధవారం పుట్టంగండి వద్ద సాగర్ వెనుక జలాల నుంచి నాలుగు ఎమర్జెన్సీ మోటర్ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 508 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుండి నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. సాగర్‌లోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి పంప్‌హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. నీటి మట్టం డెడ్‌స్టోరేజీకి చేరుడంతో సరిగ్గా ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ చేపట్టారు. పుట్టంగండిలో అత్యవసర పంపింగ్ కోసం జలాశయంలో జీరో పాయింట్ వద్ద మొత్తం పది మోటర్లను ఏర్పాటు చేశారు. మొదటగా 60 క్యూసెక్కుల సామర్థ్యమున్న నాలుగు మోటార్లకు ట్రయల్ రన్ చేపట్టారు. మరో రెండు రోజుల్లో మిగిలిన మోటర్లను కూడా ప్రారంభించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ● నగర ఓటరు జాబితాలో వింతలెన్నో ● రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం నగరంలో అయోమయ పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం రెండు పేర్లు ఉన్నవారివి, చనిపోయిన, అడ్రస్ మారిన వారి ఓటరు కార్డుల గుర్తింపు హైదరాబాద్ జిల్లాలో 5.41 లక్షల ఓట్ల తొలగింపు మరణించిన వారు47,141చిరునామా మారిన వారు4,39,801డూప్లికేట్లు54,2595,41,201మొత్తం -
28 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్ గచ్చిబౌలి: మత్తుకు బానిసలైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎండీఎంఏ డ్రగ్‌తో పట్టుబడి కటకటాలపాలయ్యారు. మాదాపూర్ ఎస్ఓటీ, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడి చేసి ఇద్దరు స్నేహితులు ఏపీలోని రాజమండ్రి పట్టణం పాతపేటకు చెందిన కాటూరీ సూర్య కుమార్ (22), బాలాజీపేటకు చెందిన గుత్తుల శ్యామ్ బాబు (22)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.2 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. సూర్య కుమార్ 2023లో డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చినా అతను తీరు మారలేదు. రైల్వేలో సీనియర్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న వ్యక్తి కుమారుడు సూర్య కుమార్ బెంగళూర్‌లోని జైన్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూర్‌లో తన స్నేహితుడైన అభి ద్వారా డ్రగ్ స్మగ్లర్ నైజీరియన్ గాడ్ ఆఫ్ సాల్మన్ పరిచయమయ్యాడు. డ్రగ్స్‌కు అలవాటు పడి విలాసవంతమైన జీవితం కోసం డ్రగ్ పెడ్లర్‌గా మారాడు. అంతే కాకుండా తన స్నేహితుడైన శ్యామ్ బాబుకు మత్తు అలవాటు చేశాడు. ఈ నెల 14న బెంగళూర్ వెళ్లిన సూర్య కుమార్ గాడ్ ఆఫ్ సాల్మన్ వద్ద 30 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేశాడు. 16న తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండు గ్రాములు ఇద్దరు స్నేహితులు సేవించారు. మిగిలిన 28 గ్రాములను రాజమండ్రిలోని విద్యార్థులకు విక్ర యించాలని ప్లాన్ వేశారు. పోలీసులకు సమాచారం అందడంతో మాదాపూర్‌లోని చందానాయక్ తండాలోని రాజా రెసిడెన్సీ సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ఎండీఎంఏ సరఫరా చేసిన గాడ్ ఆఫ్ సాల్మన్ పరారీలో ఉన్నాడు. 28 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌తో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో గ్రాము ఎండీఎంఏను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హోదా ఉన్నా.. నిఘా సున్నా!
టాస్క్‌ఫోర్స్ కార్యాలయంసాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్ల కోసం దేశ వ్యాప్తంగా వేట.. నకిలీ కరెన్సీ కేసుల్లో సరిహద్దుల ఆవలి వరకు ప్రయాణం.. ఉగ్రవాద కేసుల్లో ఫీల్డ్ ఆపరేషన్లు.. కేవలం ఇవేనా..? నగర వ్యాప్తంగా ఎలాంటి సంచలనాత్మక నేరం చోటు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చిన పేరు హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ విభాగం ప్రతిష్ట ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న వివాదాస్పద అంశాలతో మసకబారుతోంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు, ఎన్నికల డబ్బు రవాణా, వ్యాపారుల కిడ్నాప్–బెదిరింపులు.. ఇలా అనేక వివాదాలు ఈ విభాగాన్ని చుట్టుముడుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల నెలకొనడానికి నగరంలోని రెండు టాస్క్‌ఫోర్స్ కార్యాలయాల్లో సరైన నిఘా లేకపోవడమూ ఓ కారణంగా నిలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. కస్టోడియల్ మరణాలకు చెక్ చెప్పడం, మానవహక్కుల ఉల్లంఘనలు లేకుండా చూడటం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచడం, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పోలీసింగ్‌లో పూర్తి పారదర్శకత కోసం ప్రతి పోలీసు స్టేషన్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్పీం కోర్టు దాదాపు పదేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. డీకే బసు వర్సస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో తీర్పు ఇస్తూ దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పలుమార్లు గడువు పెంచిన పోయిన సుప్రీం కోర్టు 2020 డిసెంబర్‌ను తుది గడువుగా నిర్దేశించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. పని చేస్తున్నాయా? లేదా? అనేది పక్కన పెడితే నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ కనిష్టంగా 11 కెమెరాలు ఏర్పాటయ్యాయి. కేవలం పోలీసుస్టేషన్లో మాత్రమే కాదు.. ఠాణా హోదా ఉన్న సీసీఎస్, సైబర్ క్రైమ్ పీఎస్‌ల్లోనూ ఇవి ఉన్నాయి. 28 ఏళ్ల క్రితమే పోలీసుస్టేషన్ హోదా.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అధీనంలో పని చేసే కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది కేవలం యాంటీ గూండా స్క్వాడ్ మాదిరిగా కేవలం ఆపరేషనల్ విభాగంగా ఉండేది. కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, పోస్టులు పొండటంలో, జీతభత్యాల విషయంలో వస్తున్న సాంకేతిక సమస్యల నేపథ్యంలో 1996లో అప్పటి పోలీసు శాఖ ప్రభుత్వానికి కీలక నివేదిక పంపింది. దీని ఆధారంగా సర్కారు కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్‌కు సైతం పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా నెల వారీ నిర్వహణ ఖర్చులు కూడా దీనికి వస్తున్నాయి. ఇలా దాదాపు 28 ఏళ్లుగా ఠాణా హోదా ఉన్న టాస్క్‌ఫోర్స్ కార్యాలయాలు (సికింద్రాబాద్‌లో ఒకటి, పాతబస్తీలో మరోటి) సీసీ కెమెరాలు లేకుండానే కాలం గడిపేస్తున్నాయి. అన్నింటిలోనూ ఏర్పాటు చేయకుండా ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయంటూ నివేదిక ఇవ్వడం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు పోలీసుస్టేషన్ హోదా 1996లోనే జీవో జారీ చేసిన అప్పటి ప్రభుత్వం ‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం ఠాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏర్పాటు చేయని అధికారులు ఫిర్యాదు చేసే విధానానికీ స్వస్తి.. టాస్క్‌ఫోర్స్ విభాగం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తే దానిపై పని భారం పెరిగి, ఫలితాలు దెబ్బతింటాయనే వాదన ఉంది. దీన్ని అంగీకరించినప్పటికీ.. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులు ఏంటనేది మాత్రం అంతు చిక్కట్లేదు. మరోపక్క టాస్క్‌ఫోర్స్ విభాగం పట్టుకునే నేరగాళ్లపై నమోదయ్యే వాటిలో అత్యధికం సుమోటో కేసులే. అంటే.. పోలీసులే ఫిర్యాదుదారుడిగా ఉంటారు. ఓ నేరగాడిపై సమాచారం అందుకుని, వలపన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారే సంబంధిత పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తుండేవారు. దీనివల్ల భవిష్యత్తులో సాక్ష్యం చెప్పడం వంటివి తప్పనిసరి కావడంతో ఈ విభాగం అధికారుల్లో జవాబుదారీతనం ఉండేది. 2015 నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో, పక్కాగా అమలు కావట్లేదు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ స్థానిక పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకొంటున్న సందర్భాలూ అనేకం ఉంటున్నాయి. ఈ కేసుల్లో ఆయా ఠాణాల అధికారులే ఫిర్యాదు చేస్తూ సుమోటో కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ కారణాలే టాస్క్‌ఫోర్స్ అభాసుపాలు కావడానికి మూలం అనే వాదన బలంగా వినిపిస్తోంది.
Advertisement
Photos
View allVideo
View allదిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement