నేరస్థుడితో టీ కొట్టు పెట్టించారు | The culprit put the tea shop | Sakshi
Sakshi News home page

నేరస్థుడితో టీ కొట్టు పెట్టించారు

Nov 26 2015 6:24 PM | Updated on Aug 11 2018 4:36 PM

పాత నేరస్తుడితో టీ కొట్టు పెట్టించిన సైబరాబాద్ పోలీసు అధికారులు.

పాత నేరస్తుల్లో మార్పు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నామని సైబరాబాద్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ నీవన్ కుమార్ అన్నారు. పాత నేరస్తుల స్కిల్స్ ను బట్టీ జీవనోపాధి కల్పిస్తున్నామని చెప్పారు. గురువారం ఎల్బీనగర్ రింగురోడ్డ ప్రాంతంలో పాత నేరస్తుడు.. ఆలుగడ్డ ప్రసాద్ రెడ్డి  టీస్టాల్ ను ఆయన ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామానికి చెందిన ఆలుగడ్డ ప్రసాద్ రెడ్డి చిన్నప్పటి నుంచీ నేరాలు చేసే వాడని.. 1990లో హత్యకేసులో జైలు కెళ్లాడని తెలిపారు. బాంబుల కేసులో మరో సారి జైలు కెళ్లితిరిగి వచ్చాడు. దీంతో పాటు.. కడప, కర్నూలు, రంగారెడ్డి, ప్రకాశం జిల్లాల్లో అనేక కేసులల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇతనిపై 120 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అనేకమార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. నేరాల బాట పట్టనని ప్రసాదరెడ్డి మాటివ్వడంతో.. టీస్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు సాయం చేసామని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement