మహిళ దారుణ హత్య | The brutal murder of woman | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Sep 21 2016 11:41 AM | Updated on Sep 4 2018 5:24 PM

మహిళ దారుణ హత్య - Sakshi

మహిళ దారుణ హత్య

నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.

నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి మహిళ పై దాడిచేసి కిరాతకంగా హతమార్చాడు. స్థానికంగా నివాసముంటున్న ఉమ(45)కు గత కొన్ని రోజులుగా ఓ ఇంటి స్థలం విషయమై ధర్మయ్యతో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఉమను, ధర్మయ్య ఇనుప రాడ్‌తో కొట్టి హతమార్చాడు. ఇది గుర్తించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement