ఇల్లు ఖాళీ చేయమంటే ప్రాణం తీశాడు | Tenant murders house owner | Sakshi
Sakshi News home page

ఇల్లు ఖాళీ చేయమంటే ప్రాణం తీశాడు

Mar 4 2016 6:57 PM | Updated on Jul 30 2018 8:29 PM

ఇల్లు ఖాళీ చేయాలని కోరిన యజమానిపై కిరాయిదారుడు దాడి చేసి కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు.

పహాడీషరీఫ్ (హైదరాబాద్) : ఇల్లు ఖాళీ చేయాలని కోరిన యజమానిపై కిరాయిదారుడు దాడిచేసి కొట్టడంతో ఆ యజమాని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హబీబ్‌నగర్ ప్రాంతానికి చెందిన గౌస్‌ఖాన్ (40) ఇంట్లో వారం రోజుల క్రితం అహ్మద్ బిన్ సాదిక్ (27) అనే ఆటోడ్రైవర్ భార్యాపిల్లలతో కలిసి అద్దెకు దిగాడు. కాగా సాదిక్ రోజూ మద్యం తాగి వచ్చి భార్యను కొడుతూ రణరంగం సృష్టిస్తుండడంతో ఇల్లు ఖాళీ చేయాలని గౌస్ కోరాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గౌస్‌ఖాన్ భార్య భానుబేగంతో సాదిక్ ఘర్షణ పడ్డాడు. అడ్డు వెళ్లిన గౌస్‌ఖాన్‌పై దాడిచేసి విచక్షణా రహితంగా కొట్టడంతో గౌస్‌ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement