‘రైతులకు నాణ్యతతో 9 గంటల విద్యుత్’ | telangana assembly sessions day 2 | Sakshi
Sakshi News home page

‘రైతులకు నాణ్యతతో 9 గంటల విద్యుత్’

Dec 17 2016 3:52 PM | Updated on Aug 11 2018 6:42 PM

గృహ వినియోగదారులకు 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు

హైదరాబాద్: గృహ వినియోగదారులకు 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని, రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు. శాసనసభలో విద్యుత్ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని, మే నెల నాటికి 94 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 
మరమ్మతులకు గురైన సబ్ స్టేషన్లను 24 గంటల్లోపే సరిచేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరూ తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. విద్యుత్ శాఖలో 20 వేల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామంటూ.. ఇప్పటికే 1100 మందికి పైగా క్రమబద్ధీకరించామని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement