ప్రభుత్వాన్ని కాపాడుకోడానికే.. కలుస్తున్నారు! | tamilnadu factions merging to save government, says muralidhar rao | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని కాపాడుకోడానికే.. కలుస్తున్నారు!

Apr 18 2017 6:23 PM | Updated on Mar 29 2019 8:33 PM

ప్రభుత్వాన్ని కాపాడుకోడానికే.. కలుస్తున్నారు! - Sakshi

ప్రభుత్వాన్ని కాపాడుకోడానికే.. కలుస్తున్నారు!

తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన ఏమీ లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు.

తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన ఏమీ లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు. ఉప ఎన్నికల విషయంలో టీటీవీ దినకరన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి దొరికేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు రెండూ కలవాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో అమిత్‌ షా...
మే 23, 24, 25 తేదీలలో తెలంగాణలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటిస్తారని, ఆ తర్వాత మరోసారి సెప్టెంబర్ నెలలో కూడా పర్యటిస్తారని మురళీధర్ రావు తెలిపారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement