టేబుల్ ఫ్యాన్‌లో 3 కిలోల బంగారం | Table Fan In 3 kg of gold | Sakshi
Sakshi News home page

టేబుల్ ఫ్యాన్‌లో 3 కిలోల బంగారం

Jul 3 2015 1:22 AM | Updated on Aug 28 2018 7:14 PM

దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు టేబుల్ ఫ్యాన్ లో మూడు కిలోల బంగారాన్ని తీసుకురాగా అధికారులు పట్టుకున్నారు.

విమానాశ్రయంలో పట్టివేత
శంషాబాద్: దుబాయ్ నుంచి వచ్చి న ఓ ప్రయాణికుడు టేబుల్ ఫ్యాన్ లో మూడు కిలోల బంగారాన్ని తీసుకురాగా అధికారులు పట్టుకున్నారు.   హైదరాబాద్‌కు చెందిన హిజ్రీ గురువారం దుబాయ్ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి వద్ద ఉన్న టేబుల్ ఫ్యాన్‌ను అనుమానంతో విడగొట్టి చూడగా మూడు కిలోల బరువు కలిగిన పన్నెండు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement