breaking news
table fan
-
ఇది ఫ్యాన్ అనుకుంటే పొరపాటే..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని కురవిలోని శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలకు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అందరికి నేరుగా శానిటైజర్ అందించడం వీలు కాకపోవడంతో ప్రత్యేక ఫ్యాన్ వంటి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కింది భాగంలోని ట్యాంకులో శానిటైజర్ ద్రావణం పోస్తే, పైపుల ద్వారా పైకి వెళ్లి ఫ్యాన్ రెక్కలు తిరిగే క్రమంలో మధ్యలో నుంచి చుక్కలు చుక్కలుగా బయటకు వస్తుంది. ఆ ప్రాంతంలో చేతులు పెడితే శానిటైజర్ పడేలా ఈ ఏర్పాటు చేశారు. -
టేబుల్ ఫ్యాన్‌లో 3 కిలోల బంగారం
విమానాశ్రయంలో పట్టివేత శంషాబాద్: దుబాయ్ నుంచి వచ్చి న ఓ ప్రయాణికుడు టేబుల్ ఫ్యాన్ లో మూడు కిలోల బంగారాన్ని తీసుకురాగా అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన హిజ్రీ గురువారం దుబాయ్ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి వద్ద ఉన్న టేబుల్ ఫ్యాన్‌ను అనుమానంతో విడగొట్టి చూడగా మూడు కిలోల బరువు కలిగిన పన్నెండు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. -
కంటి నిండా నిద్రకు చల్లటి చిట్కాలు
న్యూఢిల్లీ: కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి లేకపోతే పని చేయడానికి కాళ్లు చేతులు ఆడవంటారు పెద్దలు. పెద్దల మాట సద్దిమూటగా పక్కనబెడితే.. కడుపు నిండా తిండి ఉన్నా కంటి నిండా నిద్రలేకపోతే మాత్రం కాళ్లు చేతులు ఆడని మాట వాస్తవం. అలాంటి సమయంలో చురుగ్గా పనిచేయాలంటే చిర్రెత్తుకొస్తుంది. గదిలో ఉష్ణోగ్రత 24 డిగ్రీలను దాటి పోతే నిద్ర పట్టడం కష్టమే. పట్టినా రాత్రిళ్లు పదే పదే మేల్కొచ్చి మనసున పట్టదు. ఏసీలుగల వారికి ఓకే. మరి అవిలేని మధ్య తరగతి ప్రజల పరిస్థితి మాటేమిటి. ఇలాంటివాళ్ల కోసమే ఈ చల్లని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. పడక గదిలో తలగడ పక్కన టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవాలి. దాని ముందు ఐస్ ట్రే ఉంచాలి. 2. వీలైతే తలగడను కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక తీసుకోవాలి. 3. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పడక గది కిటికీల తెరలు పగలంతా మూసి ఉంచాలి. 4. పడుకునే ముందు వదులైన దుస్తులు ధరించడమే కాకుండా కాళ్లు, చేతులు చల్లటి నీళ్లతో కడుక్కోవాలి 5. పడకపై పలుచటి దుప్పట్లను మాత్రమే వినియోగించాలి. 6. రాత్రి పూట మసాలా ఫుడ్డు, వేడి వేడి కాఫీలు తీసుకోవద్దు. 7. కీర దోసకాయ లేదా పుచ్చకాయ లేదా చల్లటి పాలు తీసుకోవాలి. ఈ చిట్కాలన్నీ పాటిస్తే కచ్చితంగా పడక గది చల్లగా ఉంటుందని, చల్లగా నిద్ర పడుతుందని, ఏసీలు కూడా ఈ చిట్కాల ముందు దిగదుడుపేనని నిపుణులు సవాలు చేస్తున్నారు. ప్రయత్నించి చూస్తే పోలా! వర్షాల వల్ల ఈ పాటికే వాతావరణం చల్లబడితే వచ్చే వేసవిలో చిట్కాలు పాటిద్దాం!