హరీశ్ రాజకీయ లబ్ధికోసం రైతుల బలి: జీవన్‌రెడ్డి | T. Jeevan Reddy comments on Minister Harish Rao | Sakshi
Sakshi News home page

హరీశ్ రాజకీయ లబ్ధికోసం రైతుల బలి: జీవన్‌రెడ్డి

Jul 15 2016 2:32 AM | Updated on Sep 17 2018 4:56 PM

హరీశ్ రాజకీయ లబ్ధికోసం రైతుల బలి: జీవన్‌రెడ్డి - Sakshi

హరీశ్ రాజకీయ లబ్ధికోసం రైతుల బలి: జీవన్‌రెడ్డి

మంత్రి హరీశ్‌రావు రాజకీయ లబ్ధికోసం మల్లన్నసాగర్‌లో భూములు కోల్పోతున్న రైతులను బలిపెట్టేందుకు...

సాక్షి, హైదరాబాద్: మంత్రి హరీశ్‌రావు రాజకీయ లబ్ధికోసం మల్లన్నసాగర్‌లో భూములు కోల్పోతున్న రైతులను బలిపెట్టేందుకు కుట్ర జరుగుతున్నదని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూముల విలువను పెంచి, నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని సూచించారు. అలాకాకుండా, రైతులను ముంచాలని ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమన్నారు. మంత్రి హరీశ్‌రావు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, కేసీఆర్ మెప్పు పొందడానికి భూ నిర్వాసితుల నోళ్లలో మట్టికొట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement