హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో..మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
టీచర్ మందలించిందని.. విద్యార్థిని ఆత్మహత్య
Nov 24 2016 11:00 AM | Updated on Nov 9 2018 4:36 PM
హైదరాబాద్: హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో..మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నగరంలోని హయత్‌నగర్ పోలీస్‌స్టేసన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న నందిని(15) సాయి చైతన్య స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. హోం వర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో.. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురి మృతికి కారణమైన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నందిని తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.
Advertisement
Advertisement