బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక రంగు చీర | Special Symbolic saree to design for Bathukamma festival | Sakshi
Sakshi News home page

బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక రంగు చీర

Sep 22 2016 3:23 PM | Updated on Sep 4 2017 2:32 PM

బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక రంగు చీర

బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక రంగు చీర

రాష్ట్ర సర్కారు బతుకమ్మ పండుగను సరికొత్త పంథాలో ఆకర్షణీయంగా నిర్వహించబోతుంది.

హైదరాబాద్: రాష్ట్ర సర్కారు బతుకమ్మ పండుగను సరికొత్త పంథాలో ఆకర్షణీయంగా నిర్వహించబోతుంది. గతేడాది కేటాయించిన రూ.10 కోట్ల బడ్జెట్‌ను ఈసారి సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు పెంచి మంజూరు చేశారు. అందులో బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించారు. ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగ కళ కనపడేలా చేయనున్నారు. ఈ నెల 30 నుంచి తొమ్మిది రోజులపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి.

కేరళీయుల గ్రామీణ పండుగ ఓనంను అక్కడి ప్రజలు పదిరోజులపాటు చూడముచ్ఛటగా జరుపుకొంటారు. ఈ పండుగను నేరుగా తిలకించేందుకు విదేశీయులు సైతం హాజరు అవుతారు. సర్కారు కూడా ఈసారి తిరువనంతపురంలో ఓనం పండుగ ఎలా నిర్వహిస్తారో అలాగే వినూత్నంగా హైదరాబాద్‌లో నిర్వహించాలని సంకల్పించింది. కేరళ మహిళలు 'కసవు చీరలు'  ధరించి పండుగ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతారు. అదే తరహాలో ఇక్కడ కూడా బతుకమ్మ పండుగలో మహిళలు తెలంగాణ విశిష్ఠతను యాది చేసే ప్రత్యేక రంగుతో కూడిన చీరను తీసుకురానున్నారు.

అక్టోబర్ ఆరో తేదీన 15 వేలమంది మహిళలతో ఒకే రంగు చీర ధరింపచేసి ఎల్‌బీ స్టేడియంలో గ్రాండ్ బతుకమ్మ పేరుతో సరికొత్త సాంస్కృతిక అంశాలు మేళవించి బతుకమ్మ ఉత్సవం నిర్వహించనున్నారు. సర్కారులోని కొందరు అధికారుల ఆలోచనలను సీఎం కార్యాలయ అధికారులు కూడా ఆమోదం తెలినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నారు. తొమ్మిదో తేదీన మాత్రం ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు యథావిధిగా నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement