పా..పా..పాము..ట్రాఫిక్ జాం | snake and traffic jam | Sakshi
Sakshi News home page

పా..పా..పాము..ట్రాఫిక్ జాం

Mar 6 2015 12:16 AM | Updated on Sep 2 2017 10:21 PM

రోడ్డుకు అడ్డంగా నాగుపాము రావడంతో భయంతో వాహనదారులు ఆగిపోయారు.

గచ్చిబౌలి(హైదరాబాద్): రోడ్డుకు అడ్డంగా నాగుపాము రావడంతో భయంతో వాహనదారులు ఆగిపోయారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్ రోడ్డుపైకి దాదాపు మూడడుగుల పొడవైన తాచుపాము వచ్చింది. అక్కడే అర్ద గంటపాటు ఉంది. దీంతో అటుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఫోన్ చేయడంతో స్నేక్ సొసైటీ సభ్యుడు ప్రశాంత్ వచ్చి దానిని పట్టుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు గుంతలుగా ఉండటంతో పాము పాకలేక రోడ్డుపైనే ఉండిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement