రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు నిర్మించాలని నిర్ణయించారు. ప్రధాన జంక్షన్ల వద్ద ఎలివేటెడ్ కారిడార్లు, కన్సల్టెంట్ల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు.
హరిహర కళాభవన్ నుంచి ఉప్పల్ వరకు, నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్ వరకు, తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ వరకు, చార్మినార్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు స్కైవేల నిర్మాణం చేపట్టాలన్నారు. మెట్రోరైలు మార్గం ఎక్కడైనా ఈ స్కైవేలకు అడ్డం వస్తే.. దాని పైనుంచి ఈ నిర్మాణాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ తెలిపారు.