ఎక్సైజ్ శాఖలో సిమ్ కార్డుల రగడ | sim cards conflict in excise department | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ శాఖలో సిమ్ కార్డుల రగడ

Sep 26 2014 12:54 AM | Updated on Sep 2 2017 1:57 PM

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో సిమ్ కార్డుల రగడ రాజుకుంటోంది. డిపార్ట్‌మెంటుకు సంబంధించి కామన్ యూజర్ గ్రూప్ (సీయూజీ) సిమ్ కార్డులను ఎక్సైజ్ మంత్రి పేషీ మొత్తానికి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు పెట్టడం..

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో సిమ్ కార్డుల రగడ రాజుకుంటోంది. డిపార్ట్‌మెంటుకు సంబంధించి కామన్ యూజర్ గ్రూప్ (సీయూజీ) సిమ్ కార్డులను ఎక్సైజ్ మంత్రి పేషీ మొత్తానికి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు పెట్టడం.. ఇది కుదరదంటూ ఎక్సైజ్ శాఖ తేల్చి చెప్పడమే ఇందుకు కారణం. మంత్రి పేషీ సిబ్బందితో పాటు గన్‌మెన్లకు సిమ్ కార్డులు ఇవ్వాలంటూ పేషీ నుంచి ఫైల్ సర్క్యులేట్ చేశారు. మొత్తం తొమ్మిది మంది పేర్ల జాబితా ఫైల్ ఎక్సైజ్ శాఖకు చేరింది. ఒక్క మంత్రికే సిమ్ కార్డు ఇచ్చే విధానం ఉందని, ఆయన పేషీ సిబ్బందికి ఇచ్చే విధానం లేదని అధికారులు తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement